FbTelugu

పేరుకే ఏఈ.. సోదాల్లో ఏసీబీ అధికారులకే షాక్

* భారీగా ఆస్తులను కూడబెట్టిన ఏఈ
* ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్ లో వందల కోట్లు
విశాఖపట్నం: అతడు పేరుకే ఏఈ(ఎలక్ట్రికల్ ఇంజనీర్).. కానీ అతడు అక్రమంగా కూడబెట్టిన ఆస్తులను చూసి ఏకంగా ఏసీబీ అధికారులే షాక్ అవుతున్నారు. వివరాల్లోకెళితే. కొమ్మది ఏఈ నాగేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై.. తాజాగా ఏసీబీ అధికారులు ఇవాళ ఆరు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

సోదాల్లో నాగేశ్వరరావుకు విశాఖలో సీతమ్మధార, సీతంపేట, విశాలాక్షి నగర్, ఎంవిపి కాలనీ, రాంబిల్లి ప్రాంతాలతోపాటూ తెలంగాణలోనూ భూములు, ఇళ్లు, ఇళ్లస్థలాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నాగేశ్వరరావు గతంలోనే ఏసీబీ అధికారులకు చిక్కి సస్పెండ్ అయ్యారు. తిరిగి 2012లో మళ్లీ విధుల్లో చేరారు. అప్పటి నుంచి లంచాలు వసూలు చేస్తూ ఆస్తులు భారీగానే కూడబెట్టినట్టు గుర్తించారు. మూడు లాకర్లను కూడా సీజ్ చేసినట్టు తెలిపారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ షకీలా భాను నేతృత్వంలో ఈ దాడులు నిర్వహించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.