FbTelugu

డ్రైవర్ క్లూ తో హత్య జరిగిందా?

పెద్దపల్లి: అడ్వకేట్ గట్టు వామన్ రావు దంపతుల హత్య.. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతోనే జరిగిందా అంటే అవుననే విధంగా దుర్ఘటన జరిగిన తీరును పరిశీలిస్తే అర్థమవుతుంది.
గత కొద్ది రోజులుగా వామన్ రావు స్వగ్రామం గుంజపడుగు రావడం లేదు. అయితే వాట్సప్ గ్రూపులలో మాత్రం చురుకుగా ఉంటున్నాడు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడు. బుధవారం నాడు వామన్ రావు మంథని వచ్చే విషయం ఆయన కారు డ్రైవర్ సతీష్ ద్వారా నిందితులు తెలుసుకుని ఉంటారనేది దుర్ఘటన జరిగిన తీరును బట్టి అర్థమవుతుంది.

మంథని నుంచి 16 కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత కల్వచర్ల వద్ద వామన్ రావు కారును దుండగులు అడ్డగించారు. ఓవర్ టేక్ నిలువరించినా వాహనాన్ని ముందుకు తీసుకువెళ్లకుండా డ్రైవర్ తన డోర్ తీసి దిగిపోయాడు. ఆ వెంటనే దుండగులు కారులో ఉన్న అడ్వకేట్ ను బయటకు లాగి రోడ్డుపైనే పొడిచి చంపారు. కారులో అడ్వకేట్ భార్య నాగమణిని నరికారు. ఈలోపు డ్రైవర్ సతీష్ ఘటనా ప్రాంతం నుంచి జారుకోవడం, మళ్లీ రావడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఈ లోపు పోలీసులు వచ్చి డ్రైవర్ సతీష్ ను అదుపులోకి తీసుకుని పెద్దపల్లి పోలీసు స్టేషన్ తీసుకువెళ్లి వాంగ్మూలం తీసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.