హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం గతంలో న్యాయవాదుల ఫండ్ కు విడుదల చేసిన 100 కోట్లు ఫండ్ పై హైకోర్టు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
న్యాయవాది రాపోలు భాస్కర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) ధాఖలు చేయగా పిటీషనర్ తరపు సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య వాదనలు వినిపించారు. గతంలో న్యాయవాదుల ఫండ్ కు ప్రభుత్వం ఇచ్చిన రూ.100 కోట్ల కు వచ్చిన వడ్డీని పేద న్యాయవాదులకు అందించాలని పిటీషనర్ కోరారు.
అడ్వకేట్లకు ఉపాధి లేకపోవడంతో ఇటీవల ప్రభుత్వం రూ.25 కోట్లు విడుదల చేసిందని ఏజీ బీఎస్. ప్రసాద్ కోర్టుకు తెలిపారు. రూ. 25 కోట్ల గురించి తాము అడగడం లేదని రూ.100 కోట్ల న్యాయవాదుల ఫండ్ గురించి తాము అడుగుతున్నామన్నామని పిటీషనర్ తెలిపారు. లాక్ డౌన్ సమయంలో న్యాయవాదులు కేసులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
రూ.100 కోట్ల ఫండ్ కు వచ్చిన వడ్డీ ని న్యాయవాదులకు ఇవ్వాలని పిటీషనర్ విన్నవించారు. పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేయాలని ప్రభుత్వాని కు హైకోర్టు అదేశించింది. రూ. 25 కోట్లు ఏ ప్రాతిపదికన న్యాయవాదులకు ఇస్తున్నారో రేపటి లోగా తెలపాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.