FbTelugu

కర్ణాటకలో యాడ్స్ దుమారం…

బెంగళూరు: కరోనా మహమ్మారి సమయంలో ప్రభుత్వ నిధులను అవసరం లేని ప్రచారానికి ఖర్చు పెడుతుండడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ సమయంలో చేయాల్సిన పనులు ఇలాంటివేనా అని మండిపడుతున్నారు.
బెంగళూరు మెట్రో రైలుకు ప్రధాని నరేంద్ర మోదీ నిధులు మంజూరు చేయడంతో కర్ణాటక బిజెపి ప్రభుత్వం పెద్ద ఎత్తున పత్రికలకు యాడ్స్ ఇచ్చింది. రూ.100 కోట్ల వరకు ఇచ్చిన యాడ్స్ పై ప్రజలు, ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కోవిడ్ యోధులను సత్కరించడానికి నిధులు లేవని చెబుతున్న సర్కార్ కు ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఆర్టీసి కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేందుకు డబ్బులు లేవని చెప్పి ప్రకటనలకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుందని ఆరోపించింది. ఇదే అంశంపై మాజీ సిఎం కుమార స్వామి స్పందించారు. ఈ రోజు న్యూస్ పేపర్లను చూసి చాలా బాధపడ్డాను. బెంగళూరు మెట్రో రైలు బడ్జెట్ కు కేంద్రం ఆమోదముద్ర వేసిందని ధన్యవాదాలు తెలుపుతూ యాడ్స్ ఇచ్చారు. కేంద్రం భిక్షగా వేయలేదని కుమార స్వామి మండిపడ్డారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి ప్రచారం అవసరమా అని కుమార స్వామి నిలదీశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.