FbTelugu

అఖిలప్రియ పిటిషన్ పై విచారణ వాయిదా

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో నిందితులైన టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ పై విచారణను సికింద్రాబాద్ కోర్టు రేపటికి వాయిదా వేసింది. భూమా అఖిల ప్రియను నిన్న పోలీసులు అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించిన

విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. పోలీసులు తమ రిపోర్టులో అఖిలప్రియను ఏ1 గా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ3 ముద్దాయి అఖిలప్రియ భర్త భార్గవరామ్ కోసం గాలింపు కొనసాగుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.