FbTelugu

రిమ్స్ ఆస్పత్రి ఎదుట ఆదివాసీల ధర్నా

అదిలాబాద్ : స్థానిక రిమ్స్ ఆస్పత్రిలో ఇంద్రవెల్లికి చెందిన ఆదివాసీ గర్భిణి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణి మృతిచెందింది అంటూ.. రిమ్స్ ఆస్పత్రి ఎదుట మృతురాలి బందువులు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకులు ధర్నాకు దిగారు.

తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు చేపట్టారు. గత నాలుగు రోజులుగా గర్భిణిని డాక్టర్లు పట్టించుకోకపోవడంతోనే మృతి చెందిందని, దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

You might also like