FbTelugu

కేసీఆర్ పై చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నా

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్

హైదరాబాద్: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులపై తను చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి స్పష్టం చేశారు.

ఆదివారం నాడు వరంగల్ లో చేసిన ఆరోపణలు నిరూపిస్తానని ఆయన సవాల్ చేశారు. నిజామాబాద్ ఎంపీ వరంగల్ ఎందుకు వచ్చారు, ఏం పని అని టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంటు సభ్యుడిగా భారతదేశంలో ఎక్కడైనా తిరిగే హక్కు తనకు ఉందన్నారు. మళ్లీ వరంగల్ వస్తా, ఏం చేస్తారో చేసుకోండని ఆయన టీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు.
టీఆర్ఎస్ నాయకుల కబ్జా భాగోతాలను కూడా బయటపెడతానని అరవింద్ తెలిపారు. కబ్జా భాగోతాలను విని ప్రజలే సరైన బుద్ది చెబుతారని ఆయన అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.