FbTelugu

సిరం అధినేత పూనావల్లాకు భద్రత

ముంబయి: పుణెలోని సిరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అధినేత అదర్‌ పూనావల్లా కు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పించింది. ఆయనకు ఒకరు లేదా ఇద్దరు కమెండోలతో పాటు 11 మంది పోలీసు సిబ్బంది భద్రతగా ఉండనున్నారు.

ఈ మధ్యకాలంలో తమ అధినేత పూనావల్లాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కంపెనీ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు ఈ నెల 16న లేఖ రాశారు. కోవిషీల్డ్ డోసులు ఎక్కువ సంఖ్యలో కేటాయించాలంటూ పలువురు ఒత్తిడి చేస్తున్నారని, లేదంటే సంగతి చూస్తామని బెదిరిస్తున్నారన్నారు. కంపెనీ డైరెక్టర్ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర హోం శాఖ ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.