FbTelugu

ముచ్చటగా మూడో వివాహం

చెన్నై: ప్రముఖ నటీనటులు విజయ్ కుమార్, మంజూల దంపతుల తొలి కుమార్తె వనితా విజయ్ కుమార్, పీటర్ పాల్ ను మూడో వివాహం చేసుకున్నది.

ఇవాళ సాయంత్రం చెన్నైలో క్రైస్తవ మతాచారం ప్రకారం కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఇరువురు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ పెళ్లి వేడుకలో పిల్లలు జోవికా, జయనిత పాల్గొన్నారు. 2000 సంవత్సరంలో ఆకాష్ ను పెళ్లి చేసుకుని 2005 లో విడిపోయింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె పుట్టారు.

మళ్లీ 2007లో ఆనంద్ జయదర్శన్ ను రెండో వివాహం చేసుకోగా కుమార్తె పుట్టింది. 2012లో ఆయనతో విడాకులు తీసుకున్న వనితా తాజాగా పీటర్ పాల్ ను వివాహం చేసుకున్నది. తెలుగు, తమిళ, మలయాల చిత్రాలలో వనితా నటించి, తమిళ బిగ్ బాస్ 3 లో పాల్గొని మళ్లీ తెరమీదికి వచ్చారు.

You might also like