FbTelugu

డ్రగ్ కేసులో నటి శ్వేత పరారీ, ప్రత్యక్షం

ముంబై: డ్రగ్స్ తో పట్టుబడిన నటీమణీ శ్వేతా కుమారి సోమవారం ఉదయం పరారీ అయ్యింది. తమ కస్టడీ నుంచి తప్పించుకోవడంతో ఎన్సీబీ అధికారులు వెంటనే పోలీసు శాఖను అప్రమత్తం చేశారు.
ఏమైందో ఏమో మధ్యాహ్నం నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారుల ముందు ప్రత్యక్షం కావడం జరిగింది. ముంబైలోని మీరా రోడ్‌లో ఉన్న ఒక స్టార్ హోటల్లో డ్రగ్స్ పెడ్లర్లు మహ్మద్‌ చాంద్‌ పాషా, సప్లయర్‌ సయ్యద్‌తో టాలీవుడ్ నటీమణి శ్వేతా కుమారి శనివారం రాత్రి పట్టుబడిన విషయం విదితమే. నిందితురాలు తెలుగులో నాలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.

డ్రగ్స్‌ కేసులో నిందితురాలిగా ఉన్న శ్వేతా కుమారికి మాఫియా డాన్‌ కరీం లాలాతో సంబంధాలున్నట్టు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. కరీం లాలాతో కలిసి ఆమెకు డ్రగ్స్ వ్యాపారంలో వాటాలున్నట్టు కూడా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈమె ఇచ్చిన సమాచారం మేరకు కరీం లాలా కోసం ఎన్‌సీబీ గాలింపు ముమ్మరం చేసింది. కరీం లాలా దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం శ్వేతాకుమారి ఎన్సీబీ అదుపులో ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.