FbTelugu

బిల్లు చూస్తుంటే ఆటో రిక్షా గుర్తొస్తోంది: హీరో సందీప్

కరెంటు బిల్లలను చూస్తుంటే చిన్నప్పటికీ ఆటో రిక్షా మీటర్ గుర్తొస్తోందంటూ హీరో సందీప్ కిషన్ ట్వీట్ చేశాడు. ఎవరికి ఎంత ఎక్కువ బిల్లు వచ్చిందని ఆన్ లైన్ వార్ ప్రారంభమైనా ఆశ్చర్యం లేదన్నారు.

కరెంటు బిల్లులపై సామాన్యులతో పాటు సెలెబ్రిటీలు కూడా షాకవుతున్నారు. ఇప్పడు వేస్తున్న బిల్లులపై నాలుగైదు రెట్లు అదనంగా బిల్లులు రావడంతో సెలెబ్రిటీలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే తాఫ్పీ, కార్తీక వంటి హీరోయిన్లు తమ ఇళ్లకు వచ్చిన కరెంటు బిల్లులును చూసి షాకయ్యారు. తాజాగా సందీప్ కిషన్ కూడా కంగుతిన్నాడు. ఇంటి దగ్గర మీటర్ చూస్తుంటే చిన్నప్పటి ఆటో రిక్షా మీటర్ గుర్తొస్తుందంటూ చురక అంటించాడు. ఈ బిల్లులను చూస్తుంటే కొత్త సినిమాల వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్స్ లా ఉన్నాయని సందీప్ కామెంట్ చేశాడు.

 

You might also like