FbTelugu

నటి రియా విషకన్య…

పాట్నా: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ప్రియురాలు నటి రియా చక్రవర్తి విషకన్య అని, కాంట్రాక్టు కిల్లర్ అని జేడీయూ నేత మహేశ్వర్ ఘాటుగా విమర్శించారు. సుశాంత్ సింగ్ ది హత్యేనని, దీని వెనుక పెద్ద ముఠా ఉందని ఆయన ఆరోపించారు

రియా చక్రవర్తి ప్రేమ నటించి కోట్లాది రూపాయలు సుశాంత్ నుంచి వసూలు చేసిన హంతకి అని ఆయన అన్నారు. డబ్బులు వసూలు చేసుకున్న తరువాత పథకం ప్రకారం ఉరేసి చంపేసిందని ఆయన అన్నారు. ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులు సక్రమంగా విచారణ జరపడం లేదని, హంతకులను కాపాడే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని మహేశ్వర్ డిమాండ్ చేశారు.  

You might also like