FbTelugu

నీళ్ల బాటిల్, లెటర్ తప్ప ఏమీ తీసుకోలేదు

ఈడీ విచారణలో రియా చక్రవర్తి వెల్లడి

ఢిల్లీ: బలవన్మరణం చెందిన బాలీవుడ్ నటుడు, ప్రియుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నుంచి తను ఒక వాటర్ బాటిల్, ఆయన రాసిన లెటర్ తప్ప ఏమీ తీసుకోలేదని నటి రియా చక్రవర్తి స్పష్టం చేశారు.

ఇదే విషయాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ (ఈడీ) అధికారుల ముందు వెల్లడించారు. సుశాంత్ నుంచి తానెప్పుడు డబ్బులు తీసుకోలేదని, ప్రతి అవసరానికి నేనే డబ్బులు ఇచ్చేదాన్నని చెప్పింది. రియా ఇచ్చిన ఈ వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు. శుక్రవారం నాడు రియా ఈడీ విచారణకు హాజరైంది.

మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ఈడీ విచారణకు హాజరై తన వాదనలు విన్పించింది. సుమారు తొమ్మిది గంటల పాటు ఆమెను సుధీర్ఘంగా విచారించి, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. తన కుమారుడి బ్యాంకు ఖాతా నుంచి రియా ఖాతాల్లోకి రూ.15 కోట్లు మళ్లినట్లు సుశాంత్ సింగ్ తండ్రి కెకె.సింగ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈడీ విచారణ జరుగుతుండగానే కేంద్ర ప్రభుత్వం సుశాంత్ బలవన్మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించింది.

You might also like