FbTelugu

సుశాంత్ కలలో వచ్చాడు.. కొడుకుగా పుడతాడు: రాఖీ సావంత్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ శృంగార నటి రాఖీ సావంత్ కలలోకి వచ్చాడు. తన గర్భం ద్వార పునర్జన్మ ఎత్తబోతున్నాడని ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది.

సుశాంత్ తనకు కలలో కన్పించి, త్వరలో నీ కొడుకుగా పుడతానని తనతో చెప్పాడని ఆమె పేర్కొన్నది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తనను బహిష్కరించిందని, తను అగ్రిమెంట్ చేసుకున్న సినిమాలను బలవంతంగా వెనక్కి తీసుకున్నారని నాతో చెప్పాడు. పూర్తి కాని తన సినిమాలలో ఐటెం నంబర్స్ చేయాలని కోరినట్లు రాఖీ సావంత్ తెలిపారు.

You might also like