FbTelugu

పెళ్లి పేరుతో వచ్చి మోసం చేస్తారు… జాగ్రత్త: నటి పూర్ణ

పెళ్లి పేరుతో ఇంటికి వచ్చి మోసం చేస్తారని, అలాంటి వారితో తస్మాత్ జాగ్రత్త అంటూ నటి పూర్ణ హెచ్చరించింది. ఇలాంటి వారితో కొత్తగా అవకాశాలు వచ్చే నటీమణులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

తమిళం, మళయాళంలో మంచి నటిగా పేరు సంపాదించుకున్న నటి పూర్ణ. కొద్ది రోజులుగా పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు మంచి సంబంధాలు వెదుకుతున్నారు. పెళ్లి పేరుతో ఒక వ్యక్తి మోసం చేసేందుకు ప్రయత్నించగా ఆమె వెంటనే మేల్కొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంధువుల స్నేహితుల ద్వారా అన్వర్ అనే వ్యక్తి పరిచయమయ్యడు.
ఈ విషయాన్ని కేరళలోని తన తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు అన్వర్ కుటుంబాన్ని ఇంటికి పిలుపించుకున్నారు. ఏం చేస్తారు, కుటుంబ విషయాలు అడగ్గా సరైన సమాధానాలు చెప్పకుండా వెళ్లిపోయారు. ఆ తరువాత అన్వర్ తమ తల్లిదండ్రులకు ఫోన్ చేసి పెళ్లి చేయాలని డిమాండ్ చేశారని పూర్ణ తెలిపింది. లేదంటే డబ్బులు ఇవ్వాలన్నారు. వినకపోవడంతో మీ అమ్మాయి పూర్ణ బయటకు వస్తుందిగా, అప్పుడు చూస్తామంటూ బెదిరించారు. త్వరలో రంగస్థలం వేదికపై వస్తావుగా, మేము చూస్తాం అంటూ వార్నింగ్ ఇవ్వడంతో పూర్ణ అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇలాంటి వారితో పలువురు అమ్మాయిలు మోసం పోయారని తెలిసిందని, జాగ్రత్తగా ఉండాలని ఆమె పలువరు యువతులను హెచ్చరించింది. అవకాశాలను కల్పిస్తామని ముందుకు వచ్చేవారి గురించి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని నటి పూర్ణ సూచించింది.

You might also like