FbTelugu

నటి నుస్రత్ ప్రమాణం అబద్దమా: బిజెపి ప్రశ్న

కొలకతా: టిఎంసి ఎంపి నుస్రత్ జహాన్ రూహి జైన్ పెళ్లిపై దుమారం చెలరేగుతోంది. తాను ఇదివరకు చేసుకున్న పెళ్లి గుర్తింపు లేదని ఆమె చేసిన ప్రకటనపై బిజెపి నేతలు ప్రశ్నల వర్షం కురిపించారు.

తనకు వ్యాపారవేత్త నిఖిల్ జైన్ తో పెళ్లి కాలేదని, రెండేళ్ల నుంచి ఇద్దరం సహజీవనం చేస్తున్నామని చెప్పడం దారుణమని బిజెపి పశ్చిమ బెంగాల్ వ్యవహారాల సహా ఇన్ ఛార్జి అమిత్ మాల్వియ అన్నారు. అంటే ఆమె పార్లమెంటులో ప్రమాణం సందర్భంగా నిఖిల్ జైన్ తన భర్త అని చెప్పింది అబద్దమా అని ఆయన ప్రశ్నించారు. ప్రమాణ స్వీకార సమయంలో నుస్రత్ జహాన్ రూహి జైన్ అని పలికారన్నారు. దానికి సంబంధించిన వీడియో క్లిప్ ను ఆయన తన ట్విటర్ లో పోస్టు చేవారు. ఆమె ఎంపి అని, పార్లమెంటు రికార్డుల్లో పెళ్లి చేసుకున్నట్లు ఉందన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.