FbTelugu

ఆదిపురుష్ లో కీర్తి సురేష్!

ముంబై: డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ భారీ చిత్రం రూపకల్పన చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి పోస్టర్ ను కూడా రెండు రోజుల క్రితం రిలీజు చేశారు.

హీరీ ప్రభాస్ పోస్టర్ రిలీజును షేర్ చేయగా, అభిమానులు మహానందపడిపోయారు. చారిత్రక నేపథ్యంలో తీస్తున్న ఈ సినిమా త్రీ డీ యాక్షన్ డ్రామాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారని టాక్ నడుస్తోంది. సీతాదేవీ పాత్ర కోసం నటీ కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కీర్తి ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కార్ వారి పాట లో నటిస్తున్నది.

You might also like