FbTelugu

స్టాలిన్ ప్రభుత్వం హానీమూన్ లో ఉంది: ఖుష్బూ

చెన్నై: రాష్ట్రంలో స్టాలిన్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వానికి మూడు నెలల పాటు హానీమూన్ కాలమని, అప్పటి వరకు ఆ పార్టీపై విమర్శలు చేయనని బిజెపి నాయకురాలు, నటి ఖుష్బూ సుందర్ స్పష్టం చేశారు.
సాధారణంగా కొత్తగా పెళ్లయిన నవ వధూవరులకు తొలి మూడు నెలలు హానీమూన్ లాంటిదే ఇది కూడా అన్నారు.

గతేడాది లాక్ డౌన్ లో వైన్ షాపులు తెరవడాన్ని డిఎంకె అధ్యక్షుడిగా ఉన్న స్టాలిన్ వ్యతిరేకించారన్నారు. తాను అధికారంలోకి రాగానే తెరిచారని, విపక్షంలో ఒక మాట మాట్లాడి, అధికారంలోకి రాగానే అదే పని చేశారని ఆమె గుర్తు చేశారు. కరోనా మహమ్మారి నుంచి కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అన్ని చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. మన దేశ ప్రజలనే కాకుండా, ఇతర దేశాల ప్రజల ప్రాణాలు రక్షించేందుకు వ్యాక్సిన్లు పంపిస్తున్నారని కొనియాడారు. మహిళలకు అర్చకత్వం ఇవ్వడం కొత్తేమి కాదని, అనాదిగా ఈ ఆచారం ఉందని ఖుష్బూ సుందర్ వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.