FbTelugu

ఏపి నుంచే ఆక్సిజన్ ప్లాంట్లు: సోనూసూద్

అమరావతి: గతేడాది కరోనా మహమ్మారి మొదలు ఇప్పటి వరకు బాధితులకు తన వంతు సాయం చేస్తున్న నటుడు సోనూసూద్ మరో నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఆక్సిజన్ కొరతతో పలువురు చనిపోతున్నారని గ్రహించిన ఆయన వాటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

తాను తలపెట్టిన ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటును ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభించనున్నారు. కర్నూలులో తొలి ప్రాధాన్యంగా ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని సోనూసూద్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తొలుత కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి, నెల్లూరు ఆత్మకూరులోని జిల్లా ఆస్పత్రిలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ తరువాత మిగతా రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్లను త్వరలో ఏర్పాటు కానున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఎంతోమందికి ఆక్సిజన్ కాన్సట్రేటర్లను అందించారు. ఇవి సరిపోకపోవడం వల్ల విదేశాల నుంచి ఆక్సిజన్ ప్లాంట్లను తెప్పిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.