FbTelugu

కోడిగుడ్లు, బ్రెడ్ విక్రయిస్తున్న నటుడు

ముంబయి: కరోనా మహమ్మారి సమయంలో వేలాది మంది సాయం చేసిన నటుడు సోనూసూద్ చిరు వ్యాపారిగా అవతారమెత్తాడు. ముంబయి మహానగరంలో లక్షల మంది చిరు వ్యాపారం చేసి కుటుంబాలను పోషించుకుంటారు.

కరోనా మహమ్మారి చిన్న వ్యాపారులను, వీధి వ్యాపారులను చిదిమేసింది. అర్థాకలితో అలమటిస్తున్న వారికి ఉపాధి పెంచేలా సోనూసూద్ ప్రయత్నిస్తున్నాడు. వారి ఉపాధికి పూర్వ వైభవం తెచ్చేందుకు చిరు వ్యాపారి అవతార మెత్తాడు. సోనూ ఒక సైకిల్ పై కూర్చుని నలువైపులా బ్రెడ్లు, గుడ్లు పెట్టుకున్నారు. ఇంటి ముందుకు వచ్చిన సూపర్ మార్కెట్ అని, పది గుడ్లు ఖరీదు చేస్తే ఒక బ్రెడ్డు ఫ్రీ అని అరిచాడు. మీ ఇంటి ముందే డెలివరీ చేస్తున్నామని చెప్పాడు. కరోనా కారణంగా వ్యాపారం లేక తల్లడిస్తున్న చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ఈ అవతారమెత్తినట్లు సోనూసూద్ తెలిపాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.