FbTelugu

డబ్బు సాయం చేస్తే బతుకుతా: పొన్నాంబళం

చెన్నై: తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాల్లో ప్రతి నాయకుడు పాత్రలో నటించి పేరు తెచ్చుకున్న నటుడు పొన్నాంబళం చావుబతుకుల్లో ఉన్నారు. తనకు సినీ పరిశ్రమ పెద్దలు ఆర్థిక సాయం చేయాల్సిందిగా వేడుకుంటున్నాడు.

గత ఐదేళ్లుగా ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ప్రాణాన్ని కాపాడుకోవాడుకోవడానికి పోరాడుతూ వచ్చాడు. ఆరోగ్యం మెరుగుపడడంతో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ చేయించుకుంటున్నారు. తన సోదరి కుమారుడు మూత్రపిండాలు దానం చేసేందుకు ముందుకు వచ్చాడు. ట్రాన్స్ ప్లాంట్ చేయించుకోవడానికి వైద్య ఖర్చులు అవసరం పడ్డాయి. సరిపడా డబ్బులు కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు పొన్నాంబళం వేడుకుంటున్నాడు. తన ఆర్థిక పరిస్థితి తెలిసి నటులు రజనీకాంత్, కమల్ హాసన్, రాధిక, ధనుష్, కెఎస్.రవికుమార్, రాఘవ లారెన్స్, ఐసరి గణేష్ లు ఆర్థికంగా సాయం చేశారని తెలిపాడు. మరింత డబ్బులు అవసరం ఉన్నందున టాలీవుడ్ పెద్దలు, దక్షిణ భారత నటీనటులు సాయం చేయాలని పొన్నాంబళం కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.