FbTelugu

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి

ముంబై: బాలీవుడ్ క్యారెక్టర్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూశారు. ముంబైలోని కోకిలా బెన్ ధీరుబాయి అంబానీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.

తుది శ్వాస విడిచే ముందు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో గడిపారు. ఆయనకు భార్య సుతప, ఇద్దరు సంతానం ఉన్నారు. అరుదైన క్యాన్సర్ కు గురైన ఆయన కొద్ది రోజుల క్రితం లండన్ లో  చికిత్స చేయించుకుని వచ్చారు. ఆయనకు రోగం మళ్లీ తిరగతోడడంతో ఇటీవలే మళ్లీ ముంబైలోని హాస్పిటల్ లో చేరారు. ఇర్ఫాన్‌కు ఒకసారి జాతీయ పురస్కారం, 4 సార్లు ఫిలింపేర్ అవార్డులు దక్కాయి.

విషాదకరమైన అంశం ఏమంటే ఇర్ఫాన్ తల్లి సైదా బేగం మూడు రోజుల క్రితం చనిపోయారు. ఇంటెన్సీవ్ కేర్ లో ఉండడం మూలంగా జైపూర్‌లో తన తల్లి చివరి చూపునకు, అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారు. కుటుంబంలో తల్లి తరువాత కుమారుడు వరుసగా చనిపోవడం అభిమానులను కంటపడి పెట్టిస్తున్నది. ఆయన మృతి పట్ల సన్నిహితులు, శ్రేయోభిలాషులు సంతాపం వ్యక్తం చేశారు.

You might also like