FbTelugu

రూ.1 వేయికి మించి డ్రా కుదరదు

ముంబయి: కర్ణాటక రాష్ట్రంలోని దక్కన్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు పై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా చర్యలు తీసుకున్నది. పలు ఆంక్షలు విధిస్తూ నోటీసులు జారీ చేసింది.
కొత్తగా రుణాలు ఇవ్వడం, నిధులు సమకూర్చుకోవడం, ఆస్తులు విక్రయించడం, డిపాజిట్లు స్వీకరించడం, పెద్ద మొత్తాల్లో చెల్లింపులు చేయవద్దని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఖాతాదారులు రూ.1వేయికి మించి డ్రా చేసుకునే అవకాశం లేకుండా ఆంక్షలు పెట్టింది.

అయినా ఖాతాదారులు ఏమాత్రం భయాందోళనకు గురి కావాల్సిన పని లేని, డిపాజిట్ ఇన్సరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కోఆపరేషన్ కింద బ్యాంకు రిజిష్టర్డు అయి ఉందని తెలిపింది. ఖాతాదారులందరికీ బీమా రూపంలో భద్రత ఉందని పేర్కొంది. బ్యాంకు ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే వరకు పరిమితులు కొనసాగుతాయని, పరిస్థితులను చక్కబడుతున్న కొద్దీ ఆంక్షలు సడలిస్తామని తెలిపింది. ఈ ఆంక్షలు ఆరు నెలల పాటు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.