FbTelugu

గచ్చిబౌలి సిఐ పై చర్యలు తీసుకోవాలి: ఎంపి రఘురామ

న్యూఢిల్లీ: తన అరెస్టు సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన తెలంగాణ పోలీసులపై చర్యలు తీసుకోవాలని వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణమ రాజు సిఎం కెసిఆర్ కు లేఖ రాశారు. ఒక ప్రజాప్రతినిధిని అరెస్టు చేసే సమయంలో అనుసరించాల్సిన విధి విధానాలు పాటించలేదన్నారు.

తన ఎనిమిది పేజీల లేఖలో పలు సందర్భాల్లో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు,పోలీసు మన్యువల్స్ మార్గదర్శకాలను తన 8 పేజీల లేఖలో ప్రస్తావించారు. ఒక ప్రజా ప్రతనిధిని అరెస్టు చేసే సమయంలో గచ్చిబౌలి సిఐ విధి విధానాలు, మార్గదర్శకాలను పట్టించుకోలేదని తెలిపారు. ఆ సిఐ పై చర్యలు తీసుకోవాలని ఆయన సిఎం కెసిఆర్ ను కోరారు. తనపై ఏపి సిఐడి సూమోటోగా కేసు నమోదు చేసిన తరువాత నన్ను అరెస్టు చేసేందుకు గచ్చిబౌలి లోని బౌల్డర్ హిల్స్ కు వచ్చారన్నారు. సిఐడి పోలీసులు అరెస్టు చేసేందుకు వచ్చిన సమయంలో గచ్చిబౌలి సిఐ కనీసం నిబంధనలు పాటించలేదన్నారు. ఎంపి గా ఉన్న నా అరెస్టు కు సంబంధించిన ప్రఆతమిక సమాచారాన్ని కూడా పరిశీలించలేదు. ట్రాన్సిట్ రిమాండ్ ఆర్డర్ తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ ఉందో లేదో కూడా చూడలేదన్నారు. నన్ను అరెస్టు చేసే సమయంలో నా ఆరోగ్య పరిస్థితి పై స్థానిక ఆసుపత్రిలో పరీక్షలు చేయించాలన్న నిబంధనలు పట్టించుకోలేదన్నారు. సిఐడి పోలీసులు న్యాయబద్దంగా, చట్టబద్దంగా వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యతను విస్మరించారని, నా అరెస్టుకు సంబంధించి ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉండగా అది కూడా తీసుకోలేదని సిఎం కు వివరించారు. ఏపి నుంచి వచ్చిన సిఐడి అడిషనల్ ఎస్పి విజయ్ పాల్ తో పాటు ఆయన బృందం తో పాటు తన నివాసానికి వచ్చిన గచ్చిబౌలి పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపి రఘురామ సిఎం కెసిఆర్ ను లేఖలో కోరారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.