FbTelugu

దేశ వ్యాప్తంగా రాత్రి పూట కర్ఫ్యూ

ఐదో దశ లాక్ డౌన్ మార్గదర్శకాలు

రాత్రి 9 నుంచి తెల్లవారుజాము 5 వరకు కర్ఫ్యూ

రోడ్లపై ఒక్కరు కూడా సంచరించవద్దు

నిత్యావసర వాహనాలు, బస్సుల, ట్రక్కులకు అనుమతి

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సర్క్యూలర్లు పంపించారు. ఐదో దశ లాక్ డౌన్ లో రాత్రి పూట జాతీయ రహదారులపై బస్సులు, ట్రక్కులు, లారీలకు అనుమతిస్తున్నామన్నారు.

రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రోడ్లపై ఒక్కరు కూడా తిరగవద్దని కేంద్రం స్పష్టం చేసింది. ఈ సమయంలో నిత్యావసర సరకులను రవాణా చేసే వాహనాలకు కూడా మినహాయింపులు ఇచ్చారు. ట్రావెల్స్ బస్సు వద్దకు, విమానాశ్రయం వెళ్లే వారికి, వచ్చేవారికి కూడా ఎలాంటి ఆంక్షలు లేవు.

You might also like

Leave A Reply

Your email address will not be published.