హైదరాబాద్: ఇవాళ జరిగిన నేరేడ్ మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. ఈ విషయాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు.
ఓటరు స్లిప్పులపై ఎలాంటి మార్కు(పెన్ను/ఇతర) తో టిక్ చేసినా చెల్లుబాటు ఓటు చెల్లుబాటు అవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో.. బీజేపీ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా.. ఓట్ల లెక్కింపు తాత్కాలికంగా నిలిచిపోగా.. తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి 782 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్టుగా ప్రకటించారు.