FbTelugu

బాలికపై యాసిడ్ దాడి

లక్నో: కొద్ది రోజులుగా ఒక బాలిక తనతో మాట్లాడడం లేదని ఆగ్రహించిన యువకుడు ఆమెపై యాసిడ్ తో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హాపూర్ జిల్లాలో ఆదివారం రాత్రి జరిగింది.

హాపూర్ కు చెందిన రోహిల్ ఖాన్ స్థానికంగా ఉండే బాలికతో స్నేహం చేశాడు. ఈ మధ్య ఆ బాలిక మాట్లాడడం మానేసింది. కోపం పెంచుకన్న రోహిల్ ఖాన్ బాలిక ఇంటికి వెళ్లి యాసిడ్ పోసి పరారీ అయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాలికను మీరట్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన ఆరు గంటల్లోనే రోహిల్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.