FbTelugu

ప్రతి ప్రైవేటు టీచర్ కు రూ.10వేలు ఇవ్వాలి: అచ్చెన్నాయుడు

అమరావతి: కరోనా దెబ్బకు దుర్భరంగా మారిన ఉపాధ్యాయుల బతుకులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు కోరారు.

రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో దాదాపు 5 లక్షలమందికి పైగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారన్నారు. కరోనా దెబ్బకు స్కూళ్లు మూతపడి ఉపాధ్యాయులు కార్మికులుగా మారారు. వీరిలో చాలా మంది అన్నమో రామచంద్రా అంటూ అలమటిస్తున్నారు. కరోనా మొదలయ్యాక ఇప్పటివరకూ 25మంది ఉపాధ్యాయులు మృతి చెందారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఉపాధి కోల్పోయిన ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని ప్రభుత్వం ఆదుకోవాలని సిఎం జగన్ ను కోరారు. ప్రతి ఉపాధ్యాయుడికి రూ. 10 వేల ఆర్థిక సాయం అందించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.