FbTelugu

మాట మార్చిన అచ్చంపేట సర్పంచ్

మెదక్: ఎవరి నుంచి బెదిరింపులు వచ్చాయో ఏమో అచ్చంపేట గ్రామ సర్పంచ్ లక్ష్మీ మాట మార్చింది. మంత్రి ఈటల రాజేందర్ భూములను కొనుగోలు చేశారని, ఆయన ఎవరినీ బెదిరించలేదని శనివారం మధ్యాహ్నం ప్రకటించింది.

తమ బిడ్డల పెళ్లిళ్ల కోసం భూములు విక్రయించారని, ఈటల మనుషులు ఏనాడు దౌర్జన్యానికి పాల్పడలేని మీడియా ప్రతినిధులకు తెలిపింది. ఇప్పుడు ధరలు పెరగడంతో మళ్లీ డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, ఇవ్వకపోవడంతో సిఎం కెసిఆర్ కు ఫిర్యాదు చేశారని ఆమె వెల్లడించింది. వీరి వెనకాల ఎవరో ఉండి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసింది.

ఏమైందో ఏమో కాని ఆమె సాయంత్రానికి తన మాట మార్చింది. మాకు మూడు ఎకరాలు ఉండగా ఈటల రాజేందర్ లాగేసుకున్నాడని చెప్పింది. మాకు కూడా కెసిఆర్ న్యాయం చేయాలని డిమాండ్ చేయడం గమనార్హం. లక్ష్మీ టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

You might also like

Leave A Reply

Your email address will not be published.