FbTelugu

పోలీసులకు లొంగిపోయిన నిందితుడు

Accused-of-surrendering-to-police

రంగారెడ్డి: అబ్దుల్లాపూర్ మెట్ లో తహశీల్దార్ పై పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. దీంతో పోలీసులు ఎమ్మార్వో హత్యకు గల కారణాలను నిందితున్ని ప్రశ్నిస్తున్నారు. అతడు వెళ్లడించిన కొన్ని విషయాలు.. నిందితుని పొలం రిజిస్ట్రేషన్ విషయంలో విజయరెడ్డి వేధించారని ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం అడిగినందుకే సజీవ దహనం చేశానని సురేష్ తెలిపినట్టు సమాచారం. కాగా ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. నిందితులు ఎవరైనా చట్టపరమైన కఠిన శిక్షలు అమలు చేయాలని, తమకు ఏదైనా సమస్య ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలే తప్ప, అధికారులపై ఇలాంటి చర్యలు చేయడం దారుణం అన్నారు. అనంతరం మంత్రి ఘటన స్థలానికి బయల్దేరారు.

You might also like