FbTelugu

గోవధ నిందితులకు 14 రోజుల రిమాండ్

సిద్దిపేట: గోవధ కేసులో 8 మంది నిందితులను ఇవాళ ఉదయం 6 గంటలకు సిద్దిపేట జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచారు. మెజిస్ట్రేట్ విచారణ జరిపి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
కోర్టు తీర్పు తరువాత 8 మంది నిందితులను సంగారెడ్డి జిల్లా జైలుకు తరలించారు. నిందితులపై సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం నాడు కేసు నమోదు అయింది. శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు సిద్దిపేట శివారు సిరిసిల్ల వెళ్లే బైపాస్ రోడ్ లో ఇటుక బట్టీల వెనుక ఉన్న రేకుల షెడ్లలో ఆవులను గోవధ జరిగింది. సమాచారం రాగా వెంటనే పోలీస్ అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గోవధ చేసిన ఆవులను పరిశీలించి, షెడ్డులో కట్టి వేసిన ఆవులను గోశాలకు పంపించడం జరిగింది. గోవధ చేసిన ఆవుల గురించి వెటర్నరీ డాక్టర్ ద్వారా పోస్టుమార్టం చేయించడం జరిగింది.

నిందితుల వివరాలు
1. మహ్మద్ జుబేర్ తండ్రి షఫీ, వయస్సు 45 సంవత్సరములు, నసిర్ నగర్, సిద్దిపేట.
2. మహ్మద్ ఖాజా తండ్రి బాబామియా, వయసు 35 సంవత్సరములు, సాజిద్ పుర, సిద్దిపేట.
3. మహ్మద్ సద్దాం తండ్రి మహబూబ్ సాబ్, వయస్సు 30 సంవత్సరములు,
సాజిద్ పుర, సిద్దిపేట.
4. మహ్మద్ అరఫత్ తండ్రి వసీం, వయస్సు 24 సంవత్సరాలు, సాజిద్ పుర, సిద్దిపేట.
5. మహ్మద్ ఇబ్రహీం తండ్రి మహబూబ్, వయసు 32 సంవత్సరములు,సాజిద్ పుర, సిద్దిపేట.
6. మహ్మద్ హర్షద్ తండ్రి ఉమన్, వయస్సు 25 సంవత్సరములు, సాజిద్ పుర, సిద్దిపేట.
7. మహ్మద్ ఆరాఫ్ తండ్రి ఇబ్రహీమ్, వయస్సు 30 సంవత్సరములు,
సాజిద్ పుర, సిద్దిపేట.
8. మహ్మద్ జావిద్ తండ్రి బాసిత్, వయసు 30 సంవత్సరములు, సాజిద్ పుర, సిద్దిపేట.

You might also like

Leave A Reply

Your email address will not be published.