FbTelugu

విజయవాడ ఎయిర్ పోర్టులో ప్రమాదం తప్పింది

విజయవాడ: గన్నవరం విమానాశ్రయంలో పెద్ద ప్రమాదమే తప్పింది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పి రన్ వే పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.

విమానాన్ని నడిపిస్తున్న పైలట్ తికమకపడడం మూలంగానే ఈ ప్రమాదం జరిగిందని ఎయిర్ పోర్టు అధికారులు అంటున్నారు. ప్రమాద సమయంలో 63 మంది ప్రయాణికులు విమానంలో ఉండగా, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. హఠాత్ సంఘటనతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. ఘటన మూలంగా కొద్ది సేపు విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.