FbTelugu

ఆంధ్రా అంటే అసహ్యించుకుంటున్నారు: అచ్చెన్న

అమరావతి: ఆంధ్రా రాష్ట్రం అంటే అసహ్యించుకునేలా వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని తయారు చేశారని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా కక్ష సాధింపులు, అవినీతి, అరాచకాలతో నిండిపోయిందని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినందుకు అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, కార్యకర్తలందరికీ బలహీన వర్గాల తరఫున కృతజ్ణతలు తెలుపుతున్నాని నూతన అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. పార్టీ అధ్యక్షులుగా నియమితులైన అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుండి బలహీన వర్గాలు టీడీపీకి వెన్నంటి ఉన్నాయని అన్నారు. పార్టీ నియమించిన అన్ని పదవుల్లో 60 శాతం పదవులను చంద్రబాబు బలహీన వర్గాలకు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే తన ముందున్న ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.

రాష్ట్రమంతా తిరిగి పార్టీ పటిష్టతకు పోరాటం చేస్తానని అన్నారు. రేపటి నుండే కార్యాచరణలోకి దిగుతున్నానని ఆయన తెలిపారు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టి టీడీపీని అధికారంలోకి తమ లక్ష్యమని ప్రకటించారు. బలహీన వర్గాలకు జరిగే ప్రతి అన్యాయాన్ని ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాం అని అచ్చెన్న తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.