FbTelugu

‘ఈఎస్ఐ’ కుంభకోణంపై ఏసీబీ దర్యాప్తు షురూ

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంపై ఏసీబీ దర్యాప్తును ప్రారంభించింది. ఈ స్కామ్ లో ప్రధాన నిందితులు దేవికారాణి ఐదేళ్లలో రూ.1000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డట్టు అధికారులు అంచనా వేశారు.

ఈ కేసులో ఇప్పటికే 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దేవికారాణి, పద్మ, వసంత, ఇందిరతో పాటూ ఓమ్ని మెడీ ఎండీ శ్రీహరి, తేజా ఫార్మా రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి లను అరెస్టు చేశారు. కాగా నిందితులు బెయిల్ పై విడుదలైనారు. ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటకలోనూ ఈఎస్ఐ కుంభకోసం జరిగినట్టు తెలుస్తోంది. ఈ స్కామ్ పై ఏసీబీ చార్జ్ షీటు దాఖలు చేయనుంది.

You might also like