FbTelugu

ఏపీ హైకోర్టు మీద, జడ్జీల మీద దూషణలా?

సుమోటోగా తీసుకోవాలని అడ్వకేట్ లేఖ

అమరావతి: న్యాయ వ్యవస్థకు భంగం కలిగేలా, జడ్జీలను అవమాన పరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ లక్ష్మీనారాయణ ఏపీ హైకోర్టు సీజే కు లేఖ రాశారు.

సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టింగ్ లు చేసిన వారిపై కేసును సుమోటోగా తీసుకొని విచారించాలని అడ్వకేట్ లక్ష్మినారాయణ లేఖలో కోరారు. వైసీపీ నేతలే న్యాయస్థానాల తీర్పులపై అనుమానాలు కలిగించేలా మాట్లాడుతుండడంతో పలుచనై పోయిందని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ కార్యకర్తలు కూడా హైకోర్టును, జడ్జీ లను విపరీతమైన బాషతో ట్రోల్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. మొత్తం పదకొండు మంది సోషల్ మీడియాలో రాసిన స్క్రీన్ షాట్ లను ఆయన తన లేఖతో పాటు పంపించారు.

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావు కేసు హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. చిన్నచిన్న కేసులు సీబీఐ ద్వారా విచారణ జరపడం సరికాదని అన్నారు. ప్రతి విషయానికీ సీబీఐ విచారణ జరిపితే రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ ఉన్న ప్రతి చోటా సీబీఐ ఆఫీసు పెట్టాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారని లేఖలో తెలియచేశారు.

You might also like