FbTelugu

నువ్వెంత అంటే… నువ్వెంత అంటూ.. దూషణలు

నియంత్రిత సాగు సమావేశంలో నేతల దూషణ పర్వం

నల్లగొండ: విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి లు తీవ్రంగా దూషించుకున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల సాక్షిగా నువ్వెంత అంటే నువ్వేంత అని పరుష పదజాలంతో తిట్టుకోవడంతో అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు.

ఇవాళ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వానాకాలం నియంత్రిత పంటల సాగుపై సమావేశం జరిగింది. ఇంకా రుణ మాఫీ చేయాలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి లేవనెత్తారు. రుణం మాఫీ చేయాలేదని తన ప్రసంగం మధ్యలో అడుగుతావా అంటూ మంత్రి జగదీశ్  రెడ్డి నువ్వు ఆఫ్ట్రాల్ అని అన్నారు. నీ లెక్కెంత అంటూ ఉత్తమ్ మండిపడ్డారు.

పీసీసీ అధ్యక్షుడిగా ఉండడం నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే ఇష్టం లేదంటూ విమర్శించారు. రూ.17వేల కోట్ల రుణ మాఫీ చేశామని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో రుణ మాఫీ చేయలేదన్నారు. ఇది అసెంబ్లీ కాదు, పార్లమెంటు కాదని అన్నారు. నేను చెప్పిందే వినాలని అన్నారు. ఆఫ్ట్రాల్, నీ లెక్కెంత అని, గొంతు పెంచుకోవద్దని, మీటింగ్ ఎందుకని పరస్పరం తిట్టుకున్నారు.

You might also like