FbTelugu

హిందువులను దూషించిన అబు ఫజల్ అరెస్టు

హైదరాబాద్: సోషల్ మీడియాలో హిందువులను లక్ష్యంగా చేసుకుని కించపరిచే వ్యాఖ్యలు చేసిన అబు ఫజల్ ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు.

దుబాయ్ నుంచి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చిన అతన్ని అరెస్టు చేశారు. చాంద్రాయణగుట్టకు చెందిన ఫజల్ గతేడాది కరోనా ప్రారంభ సమయంలో హిందువులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఈ పోస్టులు వైరల్ గా మారి దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. తమ మనోభవాలను కించపరుస్తూ వీడియోలు చేసిన అబు ఫజల్ పై దేశంలో పలు పోలు స్టేషన్లలో కేసులు పెట్టారు. అన్ని కేసులను క్రోడీకరించిన పోలీసులు అతనిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
అయితే అతను ఇక్కడ ఉండకుండా దుబాయ్ వెళ్లిపోయి అక్కడే తలదాచుకుంటున్నాడు. సద్దుమణిగిందని భావించిన అతను తిరిగి స్వదేశానికి రావడంతో పట్టుబడ్డాడు. అబు ఫజల్ హైదరాబాద్ విమానాశ్రయం వస్తున్నాడని తెలుసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు విమానాశ్రయం చేరుకుని అక్కడే అరెస్టు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.