FbTelugu

డాక్టర్లు, నర్సుల గైర్హాజరీ… మేనేజిమెంట్ల బెంబేలు

బెంగళూరు: కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో వైద్యులు, నర్సులు, మెడికల్ స్టాఫ్ విధులకు వెళ్లేందుకు జంకుతున్నారు. కొద్ది రోజులుగా గైర్హజరు పెరుగుతుండడంతో మేనేజిమెంట్లు ఆందోళనకు గురవుతున్నాయి.
శివాజీనగర్ లో ఉన్న ఒక ప్రైవేటు హాస్పిటల్ లో 44 మంది వైద్యులు, 20 మంది నర్సులు, మరికొందరు మెడికల్ స్టాఫ్ ఉన్నారు. కరోనా దృష్ట్యా ప్రతిరోజు ఐదుగురు వైద్యులు, 12 మంది నర్సులు మాత్రమే విధులకు హాజరవుతున్నారు.

కరోనా లక్షణాలు కన్పించడంతో రెండు రోజుల్లో ఎనిమిది మంది పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఐసీయులో కరోనా పాజిటివ్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. వైద్యులు, నర్సుల గైర్హాజరీ కారణంగా వారికి సేవలందించడం కష్టంగా మారింది. ఎందుకు రావడం లేదని యాజమాన్యం ఫోన్ చేస్తే… తలనొప్పి, జ్వరంగా ఉదంటూ చెప్పడంతో ఏమీ మాట్లాడలేకపోతున్నారు. బెంగళూరు నగరంలో పలు కార్పొరేట్, ప్రైవేటు హాస్పిటళ్లలో పరిస్థితి ఇదే మాదిరి ఉంది.

You might also like