FbTelugu

ఈ ఎన్నికలకు ఆప్ దూరం

చెన్నై: తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆప్ రాష్ట్ర నిర్వాహకులు వశీకరణ్ అధికారికంగా ప్రకటించారు.

ఈ ఎన్నికల్లో నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం పార్టీతో కలిసి పోటీ చేయాలని గతంలో ఆప్ నిర్ణయించింది. అయితే బీజేపీ కి వ్యతిరేకంగా సెక్యులర్ శక్తుల ఓట్లను చీల్చకుండా ఉండేందుకు పోటీ చేయకూడదని ఆప్ తీర్మానించింది. ఈ కారణంగానే ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని వశీకరణ్ తెలిపారు. బీజేపీ, ఏఐఏడీఎంకె పార్టీలు సంయుక్తంగా పోటీ చేస్తుండగా మరోవైపు డీఎంకె ఇతర పార్టీలతో కలిసి బరిలో నిలుస్తున్న విషయం తెలిసింది.

తమకు ఏ పార్టీ మీద నమ్మకం లేకపోవడంతో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గాంధీయ మక్కల్ ఇయక్కం పార్టీ నేత మణియన్ ప్రకటించారు. ఏ పార్టీ కూడా ప్రజల కష్టాలను పరిగణనలోకి తీసుకుని మేనిఫెస్టో రూపొందించడం లేదని, అందుకే బహిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.