FbTelugu

పాన్ తో ఆధార్ లింకు.. కొద్దిరోజులే మిగిలి ఉంది

ముంబయి: పాన్ కార్డు ను ఆధార్ తో లింక్ చేసుకునేందుకు కేంద్రం గడువు పెంచుతూ వస్తున్నది. మహమ్మారి కారణంగా ఈ గడువును జూన్ 30వ తేదీ వరకు పెంచింది.

ఈ గడువులోగా పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయనట్లయితే రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సమాచారాన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు తెలియచేశాయి కూడా. ఒకవేళ లింక్ చేయనట్లయితే మున్ముందు వినియోగించే అవకాశం ఉండదు. బ్యాంకింగ్ లావాదేవీల్లో అసౌకర్యం కలుగుతుంది. పాన్ కార్డు కూడా పనిచేయదు. ఇవే కాకుండా ఫించన్, ఉపకార వేతనాలు, ఎల్.పి.జి సబ్సిడీ వంటి పథకాలను పొందలేరు. వెంటనే మీరు ఐటి డిపార్ట్ మెంట్ ఫోర్టల్ లోకి వెళ్లి లింక్ చేసుకోండి.

You might also like

Leave A Reply

Your email address will not be published.