FbTelugu

పాస్టర్ అనుభవించి… వదిలేశాడు!

అండగా నటి కరాటే కళ్యాణి
రాజమహేంద్రవరం: పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక పాస్టర్ తనను నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఆరోపించింది. సినీ నటి కరాటే కళ్యాణి సహాయంతో బాధితురాలు మంగళవారం రాజమహేంద్రవరం రెండో పట్టణ పోలీసులను కలిసింది.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం… కడియం మండలానికి చెందిన ఓ యువతి ఆల్కట్ తోట సమీపంలోని చర్చికి వచ్చేది. అక్కడి పాస్టర్ షారొన్ కుమార్ (బైబిల్ మిషన్) తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి అనుభవించాడని బాధిత యువతి ఆరోపించింది. పెళ్లి చేసుకోవాలని కోరగా ముఖం చాటేశాడని, గట్టిగా నిలదీస్తే నగ్న వీడియోలు బయట పెడతానని బెదిరించాడని తెలిపింది. ఈ విషయాన్ని బయటికి చెప్తే చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తనకు తండ్రి లేడని, అందుకే భయపడి హైదరాబాదు వెళ్లిపోయి ఒకరి ఇంట్లో ఆశ్రయం తీసుకున్నట్లు యువతి వెల్లడించింది.

బాధితురాలికి అండగా పోలీస్ స్టేషన్ వచ్చిన కరాటే కళ్యాణి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ వచ్చిన బాధితురాలు ఇటీవలే తనను కలిసి తనను షారొన్ పలుమార్లు అత్యాచారం చేసిన విషయం చెప్పిందన్నారు. యువతికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి నేరుగా రాజమహేంద్రవరం తీసుకువచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.