FbTelugu

ఏడంతస్తుల భవనంపై నుంచి పడిన యువతి

హైదరాబాద్ : రాజేంద్రనగర్ సమీపంలోని ఉప్పరపల్లి జన చైతన్య వెంచర్ లో గుర్తు తెలియని యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నిర్మాణంలో వున్న ఏడు అంతస్తుల‌ భవనం పై నుండి కింద పడి దుర్మరణం పాలయింది.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి రాజేంద్రనగర్ పోలీసులు చేరుకున్నారు.  నిర్మాణం లో వున్న భవనం వద్దకు యువతి ఏలా వచ్చింది? ఎందుకు వచ్చింది? కూలీ పని కోసం వచ్చిందా అనే వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. యువతి భవనం నుండి ప్రమాదవశాత్తు కింద పడిందా? లేక ఎవరైన తోసేసారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా వున్న సిసి టివి ఫూటేజ్ ను పరిశీలించి, మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.