FbTelugu

ఐ ఫోన్ చెక్కు చెదరలేదు!

తైపి: నీటి సరస్సు ఎండిపోవడం ఆ యువకుడికి వరంగా మారింది. ఆ వ్యక్తి ఆనందానికి ఎండిన సరస్సు అని చెప్పినా ఎవరూ నమ్మలేదు.
తైవాన్ లో కొంతకాలంగా నీటి ఎద్దడి ఏర్పడి సరస్సులు, రిజర్వాయర్లు ఎండిపోతున్నాయి. సన్ మూన్ లేక్ కూడా వట్టిపోయింది. నీటి కోసం పరిసర ప్రాంతాల్లోని బోరుబావులు, చిన్న చిన్న సరస్సులపై ప్రజలు ఆధారపడుతున్నారు.

చెన్ అనే యువకుడు ఏడాది క్రితం సన్ మూన్ లేక్ లో పెడల్ బోటింగ్ చేసేవాడు. ఆ క్రమంలో ఒకరోజు తన ఐ ఫోన్11 సరస్సులో పడిపోయింది. ఎంత వెతికినా లభ్యం కాకపోవడంతో వదిలేశాడు. ఈ విషయాన్ని స్నేహితులు, సరస్సు వద్ద ఉండేవారికి చెప్పి వదిలేశాడు.
వర్షాలు లేని కారణంగా సన్ మూన్ లేక్ ఎండిపోయింది. ఎండిపోయిన సరస్సులో ఒక స్వచ్చంద సంస్థ కార్యకర్తకు చెన్ కు చెందిన ఐ ఫోన్11 కన్పించింది. ఆ ఫోన్ ను భధ్రంగా చెన్ కు అప్పగించడంతో ఆశ్చర్యపోయాడు. రోజుల తరబడి సరస్సులో ఉన్నా ఫోన్ చెక్కు చెదరలేదు. చక్కగా పనిచేయడంతో పాటు చార్జింగ్ కూడా అవుతుండడంతో చెన్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ ఫోన్ కు సంబంధించిన వీడియో ను చెన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఫేస్ బుక్ లో చేసిన పోస్టుకు పాతికవేల మందికి పైగా నెటిజన్లు వీక్షించి కామెంట్లు పెట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.