FbTelugu

తహశీల్ కు తాళం వేసిన మహిళా రైతు

గుంటూరు: అన్యాయంగా తన భూమి ని కాజేశారు అంటూ ఆగ్రహించిన మహిళ రైతు ఏకంగా తహశీల్దార్ కార్యాలయానికే తాళాలు వేసింది. ఏడు నెలల నుంచి ఎన్ని అర్జీలు పెట్టినా కూడా స్పందించకపోవడంతో రైతు తన కుటుంబంతో తహశీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించింది.

మాచవరం మండలం తహశీల్దార్ కార్యాలయం అధికారులపై రైతు కుటుంబం ఆగ్రహంతో ఉంది. తన పూర్వ పట్టా సర్వే నెంబర్ 198 లోభూమి 2.46 ఉండాల్సింది 2.23 ఉన్నది. సుమారు 23 సెంట్లు భూమి తగ్గింది. తగ్గిన భూమిని కొలతలు వేసి సరిచేయాలని రైతు కొన్ని రోజులుగా వినతి చేస్తున్నారు. మండలం లోని కొంతమంది నాయకుల మాటలు విని అధికారులు రైతుల ఇచ్చిన అర్జీ గురించి పట్టించుకోవడం లేదు.
తహశీల్దార్ బుధవారం రోజు పది గంటలకి మీ భూమి దగ్గరకు వచ్చి కొలతలు వేసి మీ భూమిని అప్పగిస్తామని హామీ ఇచ్చి కార్యాలయానికే రాలేదు. ఎంతకీ రాకపోవడంతో రైతు కార్యాలయానికి వెళ్లి అడగ్గా, మాకు తెలియదని సమాధానం చెప్పడంతో ఆగ్రహించిన మహిళా రైతు ప్రత్యక్ష చర్యలకు దిగింది. బయటకు వచ్చి ఎమ్మార్వో కార్యాలయానికి తాళం వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.