FbTelugu

దుర్గ గుడిలో బద్ధలైన అక్రమాల పుట్ట

మొత్తం 16 మంది అవినీతి ఉద్యోగులపై వేటు
శారాదా పీఠం వెళ్లొచ్చిన ఈఓ సురేష్ సేఫ్
విజయవాడ: బెజవాడ కనకదుర్గ ఆలయంలో తాజాగా మరో ముగ్గురిని సస్పెండ్ చేశారు. దీంతో సస్పెండ్ అయిన వారి సంఖ్య 16 కు చేరుకున్నది. ఉద్యోగుల అక్రమాలు రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నాయి.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై 5 రోజులపాటు కొనసాగిన అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) తనిఖీలు, విచారణ సోమవారంతో ముగిసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే 13 మంది ఉద్యోగులపై వేటు వేశారు. తాజాగా మంగళవారం నాడు మరో ముగ్గురుని సస్పెండ్ చేశారు. ఈ మేరకు 16 మంది ఆలయ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ దేవాదాయశాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. మున్ముందు ఇంకెంత మందిపై వేటు వేస్తారో తెలియడం లేదు. కమిషనర్ ఆదేశాల ప్రకారం ఆరుగురు సూపరింటెండెంట్లు, 10 మంది గుమాస్తాలు సస్పెండ్ అయ్యారు. వేటు పడినవారిలో చీరలు, ప్రసాదాలు, అన్నదానం, స్టోర్ తదితర 8 విభాగాలకు చెందిన ఉద్యోగులున్నారు.

దుర్గమ్మ ఆలయంలో… లడ్డూ ప్రసాదాలు, టికెట్లు, చీరల కౌంటర్లు, టోల్‌గేట్, కేశఖండనశాల, ప్రొవిజన్ స్టోర్, ఇంజినీరింగ్ విభాగాల్లో అవకతవకలు జరిగినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు నివేదికలో వెల్లడించారు. ఎంతో పేరుప్రఖ్యాతలు ఉన్న దుర్గగుడిలో ఈ స్థాయిలో అవినీతి వెలుగులోకి రావడం ప్రకంపనలు రేపుతోంది.
సస్పెండ్ అయిన 16 మంది సిబ్బంది వీరే..
1. కె.శ్రీనివాసరావు – ప్రసాదం తయారీ, చీరల విభాగం సూపరింటెండెంట్
2. కె.శ్రీనివాసమూర్తి – అన్నదానం విభాగం
3. ఎ.అమృతరావు – మెయిన్ స్టోర్ సూపరింటెండెంట్
4. కె.హరికృష్ణ – మెయిన్ స్టోర్ సూపరింటెండెంట్
5. పి. భాగ్యజ్యోతి – శానిటేషన్ సూపరింటెండెంట్
6. కూరెళ్ల శ్రీనివాసరావు – లీజుల విభాగం సూపరింటెండెంట్
7. జి.యశ్వంత్ – సీనియర్ అసిస్టెంట్, లీజుల విభాగం
8. బి.నాగేశ్వరరావు – సీనియర్ అసిస్టెంట్, చీరల విభాగం
9. పద్మావతి – సీనియర్ అసిస్టెంట్
10. ఎం.ఎస్.ప్రకాశరావు – జూనియర్ అసిస్టెంట్, శానిటేషన్ విభాగం.
11. పి.రవికుమార్ – దర్శనం టిక్కెట్ల రికార్డు అసిస్టెంట్
12. కె.రమేష్ – ఆర్జిత సేవల రికార్డు అసిస్టెంట్
13. రవిప్రసాద్ – సూపరింటెండెంట్
14. జె.ఏడుకొండలు – అటెండర్, ప్రసాదం టికెట్లు
15. రాంబాబు – ఫొటో కౌంటరు రికార్డు అసిస్టెంట్
16. సీహెచ్.చెన్నకేశవరావు – జూనియర్ అసిస్టెంట్, చీరల విభాగం.

You might also like

Leave A Reply

Your email address will not be published.