FbTelugu

వాగులో దర్జాగా నీళ్లు తాగుతున్న పులి

కుమ్రంభీం: తెలంగాణ వాగులో పెద్దపులి సంచారం పరిసర ప్రాంతంలో కలకలం రేపుతున్నది. ఈ సమాచారం తెలియడంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు.

పెంచికల్ పేట మండలం అగర్ గూడ, గుండెపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి హల్ చల్ చేస్తోంది. స్థానికంగా ఉన్న తెలంగాణ వాగు దాటుతున్న పులి అటుగా వెళ్తున్న ప్రజల కంటపడింది. వాగులోకి వచ్చి నీళ్లు తాగి ఆ తరువాత అగర్ గూడ అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. సంచరిస్తున్న పులి వీడియోను చిత్రీకరించి అటవీ శాఖ అధికారులకు సమాచారం పంపించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అటవీ అధికారులు పులిముద్రలను గుర్తించి ఎక్కడికి వెళ్లిందనే దానిపై ఆరా తీస్తున్నారు. సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండానలి అటవీ సిబ్బంది కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.