FbTelugu

విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు

A-teacher-who-behaves-indecently-towards-students

అనంతపురం: విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు గాడి తప్పాడు. విచక్షణ మరిచి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. వివరాల్లోకి వెళితే.. నారాయణ స్కూల్‌లో సైన్స్‌ టీచర్‌గా పని చేస్తున్న కార్తీక్‌ …వాట్సప్‌ ద్వారా ఎనిమిదో తరగతి విద్యార్థినికి అశ్లీల పోస్టింగ్స్‌, మెసేజ్‌లు పంపించాడు. ఈ విషయాన్ని గుర్తించిన విద్యార్థిని తల్లిదండ్రులు…రెండు రోజుల క్రితం కీచక టీచర్‌ను నిలదీశారు. అయితే అతగాడు బుకాయించడంతో ఆగ్రహించిన విద్యార్థిని బంధువులు దేహశుద్ధి చేశారు. ఇంత జరిగినా ఈ విషయాన్ని నారాయణ స్కూల్‌ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించకుండా గోప్యంగా ఉంచింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

You might also like