FbTelugu

2 నెలలుగా ఆ పిల్లికి తిండీతిప్పలు లేవు…

రెండు నెలల పాటు అన్నపానీయాలకు దూరంగా ఉన్నా ఏమాత్రం జంకుగొంకు లేకుండా కంటైనర్ నుంచి పిల్లి గాండ్రిస్తూ బయటకు వచ్చింది. ఈ దృశ్యాన్ని చూసిన పిల్లి యజమాని సైతం ఆశ్చర్యపోయాడు.

యూకె లో మాంటీ అనే పన్నేండేళ్ల పిల్లిని బేవర్లీ దంపతులు పెంచుకుంటున్నారు. ఈ పిల్లి అంటే ఆ దంపతులకు ఎంతో ఇష్టం కూడా. ఒక రోజు అకస్మాత్తుగా మాయమై పోవడంతో దాని కోసం వారు వెతికి వెతికి వేసారి పోయారు. ఎంతకీ ఆచూకి లభించకపోవడంతో చనిపోయి ఉండవచ్చంటూ ఊసురుమన్నారు. దీని కోసం తమ ప్రాంతంలో పోస్టర్లు కూడా అంటించారు. సోషల్ మీడియాలో మాంటి ఫొటోలు పెట్టారు కూడా.

ఏడు వారాల తరువాత ఒక కంటైనర్ లో తనకు పిల్లి ఉన్నట్లు అనుమానం ఉందని బెవర్లీ దంపతులకు ఒక వ్యక్తి చెప్పాడు. ఈ ప్రాంతం వీరి నివాసానికి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇద్దరు కలిసి కంటైనర్ వద్దకు వెళ్లి గడియ తీశారు. రెండు నెలలు తిండి లేకపోయినా అది ఏమాత్రం జంకకుండా గాంభీర్యంగా బయటకు రావడంతో యజమాని ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత యజమాని చుట్టూ తిరగడంతో దాన్ని కారులో ఇంటికి తీసుకువెళ్లాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.

You might also like