FbTelugu

మరో ఇద్దరిని బలిగొన్న వింత వ్యాధి

పశ్చిమ గోదావరి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఏలూరు వింత వ్యాధికి మరో ఇద్దరు బలైనారు. మృతులు అప్పారావు(50), సుబ్బరావమ్మ(56) గా తెలుస్తోంది.

ఏలూరు నీటిలో అత్యధికంగా సీసం, నికెల్, క్రిమిసంహారక మందుల అవశేషాలు ఉండడం కారణంగా ప్రజలు ఈ వింత వ్యాధి బారిన పడుతున్నట్టుగా.. నిపుణులు తెలుపుతున్నారు. నిన్న ఈ వ్యాధి బాధితుల్లో 30 మందిని విజయవాడ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి ఇద్దరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ వింత వ్యాధితో ఇప్పటికే వందల సంఖ్యలో ప్రజలు ఆస్పత్రుల్లో చేరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.