FbTelugu

పీకేసిన ఐసీఐసీఐ సీఈఓ కు ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: దేశంలో విజయవంతమైన మహిళా సీఈఓగా ఒక వెలుగు వెలిగి భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడిన ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ చందా కొచ్చర్ కు సుప్రీంకోర్టులో చెక్కెదురైంది.

ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ బాధ్యతల నుంచి సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. పిటీషన్ ను విచారించిన కోర్టు ఆమె పిటీషన్ ను తిరస్కరించింది. ప్రైవేటు బ్యాంకుకు, ఉద్యోగికి మధ్య జరిగిన ఒప్పందం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వీడియోకాన్ గ్రూపునకు మంజూరు చేసిన రూ.1875 కోట్ల రుణాలలో అవకతవకలు, అక్రమాలు జరిగాయని చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్ పై మానీ లాండరింగ్ కేసులు నమోదు అయ్యాయి.
ఈ ఆరోపణలపై జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ దర్యాప్తు చేసింది. కేసులు నమోదు కావడంతో యాజమాన్యంపై ఆమె పదవుల నుంచి ఊడబెరికింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె ముందస్తు పదవీ విరమణకు దరఖాస్తు చేయగా తిరస్కరించింది. పదవుల నుంచి తప్పించడాన్ని తొలుత ముంబై హైకోర్టు, ఆ తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ విజయవంతమైన మహిళా సీఈఓ కు ఊరట లభించలేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.